Nagababu: రాజ్యసభ అభ్యర్థులు ఖరారు..మంత్రివర్గంలోకి నాగబాబు..! 12 d ago
AP:టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు అయ్యారు. బీద మస్తాన్, సానా సతీష్ పేర్లు టీడీపీ ఖరారు చేసింది. ఇప్పటికే ఆర్.కృష్ణయ్య పేరును బీజేపీ ఖరారు చేసింది. మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే జనసేన నేత కొణిదల నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా కొణిదల నాగబాబు ఉన్నారు.